
ఐదు టెస్ట్‌ల సిరీస్‌లో భాగంగా ఎడ్జ్‌బాస్టన్ వేదికగా జరుగుతున్న రెండో టెస్ట్ మ్యాచ్‌లో టీం ఇండియా విజయానికి మరింత చేరువైంది. ఐదు రోజు వర్షం కారణంగా ఆట కాస్త ఆలస్యంగా ప్రారంభమైంది. ఆకాశ్‌దీప్ 80 పరుగుల జట్టు స్కోర్ వద్ద పోప్(24)ని, బ్రూక్(23)ని ఎల్‌బిడబ్ల్యూ రూపంలో పెవిలియన్ చేర్చాడు. లంచ్ బ్రేక్ సమయానికి 40.3 ఓవర్లలో ఇంగ్లండ్ 6 వికెట్ల నష్టానికి 153 పరుగులు చేసింది. ఈ మ్యాచ్‌లో విజయానికి ఇంగ్లండ్‌కు ఇంకా 455 పరుగులు అవసరం కాగా.. భారత్‌మరో నాలుగు వికెట్లు తీయాలి.