విజయవాడ అంతర్జాతీయ విమానాశ్రయం గన్నవరం నుంచి హైదరాబాద్‌కు నూతన విమాన సర్వీసు అందుబాటులోకి వచ్చింది. కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు శ్రీకాకుళం నుంచి వర్చువల్‌గా ఈ ఫ్లై91 (Fly91) సర్వీసును ప్రారంభించారు. ఉడాన్ పథకం ద్వారా ప్రాంతీయ అనుసంధానతను పెంచుతూ, దక్షిణాది రాష్ట్రాల్లో ఈ సంస్థ విస్తరిస్తున్న తీరును ఆయన కొనియాడారు. త్వరలోనే విజయవాడ నుంచి వారణాసి, కొచ్చి వంటి నగరాలతో పాటు దుబాయ్‌కు కూడా కొత్త విమాన సర్వీసులు ప్రారంభించే దిశగా అడుగులు వేస్తున్నట్లు స్పష్టం చేశారు.

