
నగర చరిత్రలో మొట్టమొదటి సారిగా గ్రాండ్వే లో విజయవాడ ఉత్సవ్ నిర్వహిస్తున్నారు. ఈ పండుగను మాజీ రాష్ట్రపతి వెంకయ్య నాయుడు, మంత్రి నారా లోకేష్ ఇవాళ ప్రారంభించారు. విజయవాడ ఉత్సవ్ కు సంబంధించి 3 వేల మంది కళాకారులతో అతిపెద్ద కార్నివాల్ అక్టోబర్ రెండో తేదీన ఉండబోతుంది. 11 రోజులపాటు విజయవాడ వైభవాన్ని తెలిపే విధంగా డ్రోన్ షో సెంటర్ ఆఫ్ ఎట్రాక్షన్ గా నిలుస్తుంది. పారా గ్లైడింగ్, హెలిరైడ్, లాంటి ఎంటర్టైన్మెంట్ ఈవెంట్స్ నిర్వహిస్తున్నారు.