
విజయవాడలోని న్యూ రాజరాజేశ్వరి పేటలో డయేరియా బాధితులు కోలుకుంటున్నారు. ఇప్పటివరకు మొత్తం 115 కేసులు నమోదైనాయి. వీరిలో ప్రస్తుతం చికిత్స పొందుతున్నవారు 61 మంది. చికిత్స తీసుకొని మరో 61 మంది డిశ్చార్జ్ అయినారు. ప్రస్తుత పరిస్థితుల దృష్ట్యా అక్కడ మెడికల్ క్యాంప్ కొనసాగుతుంది. డయేరియా కారణంగా స్థానికులు కాచి చల్లార్చిన నీరే తాగాలని వైద్యాధికారులు హెచ్చరికలు జారీ చేశారు. బాధితులకు మెడికల్ టెస్ట్లు కొనసాగుతున్నాయి.