
విజయవాడలోని యస్.యస్ కన్వెన్షన్ లో ఏర్పాటు చేసిన ఖాధీ సంత కార్యక్రమానికి సీఎం చంద్రబాబు ముఖ్య అతిధిగా పాల్గొన్నారు.ఈ సందర్భంగా గాంధీజీ విగ్రహానికి పూల మాల వేసి నివాళులు అర్పించారు.అనంతరం స్వదేశీ ఉద్యమంలో పాల్గొన్న మహనీయుల ఫొటోలతో ఏర్పాటు చేసిన ప్రదర్శనను తిలకించారు. ఖాధీ సంతలో ఏర్పాటు చేసిన స్టాల్స్ ను సందర్శించి, అక్కడ ఉన్న చేతి వృత్తుల వారితో మాట్లాడి వాటి గురించి అడిగి తెలుసుకున్నారు. అనంతరం స్వదేశీ సంత ఆవరణలో ఏర్పాటు చేసిన అమ్మవారికి సీఎం చంద్రబాబు పూజలు నిర్వహించారు.