తెలుగుదేశం మంత్రులతో మంత్రి నారా లోకేష్ ఉండవల్లి సీఎం క్యాంపు కార్యాలయంలో బ్రేక్ఫాస్ట్ సమావేశం నిర్వహించారు. సీనియర్ ఎమ్మెల్యేలు, నేతలతో తొలిసారి గెలిచిన ఎమ్మెల్యేలకు అవగాహన కల్పించాలని అన్నారు. సీనియర్లు ఎమ్మెల్యే అయిన కొత్తలో ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొన్నారు, ఎలాంటి సమస్యలు అధిగమించి ఈ స్థాయికి వచ్చారనే అవగాహన కొత్త ఎమ్మెల్యేలకు అవసరమన్నారు. కొత్త ఎమ్మెల్యేలు వరుస విజయాలు కొనసాగించాలంటే సీనియర్ల అనుభవాలు నేర్చుకోవాలని కీలక సూచనలు చేశారు.

