
WhatsApp తన వినియోగదారుల అనుభవాన్ని మెరుగుపరచడానికి ఒక కొత్త ఫీచర్‌ను తీసుకొచ్చింది. ఇక గ్రూప్ చాట్లలో టైపింగ్ శ్రమ అక్కర్లేదు. గ్రూప్ వాయిస్ చాట్ అనే కొత్త టూల్‌ను ప్రారంభించింది, మీరు గ్రూప్ చాట్‌లో నేరుగా మీ గొంతుతో మాట్లాడవచ్చు, అది కూడా హ్యాండ్స్-ఫ్రీ, రియల్-టైమ్‌లో. అంటే కాల్ చేయకుండా, నేరుగా గ్రూప్‌లో లైవ్ వాయిస్ చాట్‌ను ప్రారంభించవచ్చు, అంటే ముఖాముఖిగా మాట్లాడుతున్నట్లు ఉంటుంది.