
ప్రముఖ మెసెంజర్ యాప్‌నకు పోటీగా వచ్చిన “అరట్టై” యాప్‌నకు విశేషమైన ఆదరణ లభిస్తోంది. లాంఛ్ అయిన కొద్ది రోజుల్లోనే ఏకంగా 75 లక్షల మంది డౌన్‌లోడ్ చేసుకున్నారు. జోహో కంపెనీ రూపొందించిన ఈ యాప్‌ను కేంద్ర మంత్రితో పాటు పలువురు ప్రముఖులు ప్రమోట్ చేశారు. స్వదేశీ యాప్ అరట్టై ను వాడాలని పిలుపునిచ్చారు. కంపెనీ వివరాల ప్రకారం, అక్టోబర్ 3, 2025 నాటికి గూగుల్ ప్లే స్టోర్, ఆపిల్ స్టోర్‌లో కలిపి అరట్టై యాప్‌ను 75 లక్షల మంది డౌన్‌లోడ్ చేసుకున్నారు. ఇటీవల కాలంలో ఒక స్వదేశీ యాప్ ఇంత వేగంగా ప్రాచుర్యం పొందడం ఇదే మొదటి సారి.