
భారీ వర్షాలు, వరదలతో పోచారం డ్యామ్ డేంజర్లో పడింది. పోచారం డ్యామ్‌కు వరద పోటెత్తడంతో.. డ్యామ్ పక్కనుంచి వరద ప్రవహిస్తోంది. కట్టతెగే ప్రమాదం పొంచి ఉందని.. అధికారులు పరిసర ప్రాంతాల ప్రజలను అప్రమత్తం చేశారు. ఇవాళ రాత్రి వరద పోటు మరింత పెరగనుంది. పోచారం డ్యామ్ కట్ట తెగితే, పరిసరాల్లో జలవిలయం ముప్పు పొంచి ఉండటంతో.. డ్యామ్ కింద ఉన్న పది గ్రామాలు భయం గుప్పిట్లో ఉన్నాయి..ముప్పు పొంచి ఉన్న ప్రాంతాల ప్రజలను అధికారులు అప్రమత్తం చేశామని.. మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు.