
హిమాచల్ ప్రదేశ్ లోని మండి జిల్లాలో గురువారం ఉదయం ఆర్టీసీ బస్సు లోయలో పడి ముగ్గురు మహిళలతో సహా ఏడుగురు మృతి చెందారు. ఐదుగురు అక్కడికక్కడే మృతి చెందగా మరో ఇద్దరు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ చనిపోయారు. 20 మంది గాయపడ్డారు. సర్కాఘాట్ నుంచి దుర్గాపూర్‌కు బస్సు వెళ్తుండగా సుమారు 25 మీటర్ల లోతులోలోయలో పడింది. గాయపడిన వారిని సివిల్ ఆస్పత్రికి తరలించారు. క్రిటికల్‌గా ఉన్న ప్యాసింజర్లను బిలాస్‌పూర్ ఎయిమ్స్‌కు తీసుకెళ్లారు.