
బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు కృష్ణా, గోదావరి జలాల్లో రాష్ట్ర వాటాను పక్క రాష్ట్రాలకు దోచిపెట్టిన తెలంగాణ ద్రోహ్రం చేసిందని ఆరోపించారు. ఏపీ మంత్రి లోకేష్‌తో కేటీఆర్ సీక్రెట మంతనాలు జరుపుతున్నారని సంచలన ఆరోపణలు చేశారు. లోకేష్‌ను కేటీఆర్ కలిసింది నిజం కాదా? అని ప్రశ్నించారు. లోకేష్‌ను ఎందుకు కలుస్తున్నారనేది సమాధానం చెప్పాలని కేటీఆర్‌ను డిమాండ్ చేశారు. లోకేష్‌ను కలవలేదని కేటీఆర్ అంటే తాను మళ్లీ స్పందిస్తానని… అబద్దం అని బుకాయిస్తే వివరాలు అన్నీ బయటా పెడతానని రామ్మోహన్ అన్నారు.