
ఆపరేషన్ కగార్ లక్ష్యంగా భద్రతా బలగాలు ఛత్తీస్గఢ్లో దూసుకు పోతున్నాయి. అందులో భాగంగా కర్రేగుట్ట అటవీ ప్రాంతంలో కూంబింగ్ నిర్వహించారు. ఆ క్రమంలో మావోయిస్టులు దాచి ఉంచిన పేలుడు పదార్థాలను భారీగా భద్రతా బలగాలు స్వాధీనం చేసుకున్నారు. 51 లైవ్ బిజిఎల్.. 100హెచ్డీ అల్యూమినియం వైర్ కట్టలు, 50పైపులతోపాటు భారీగా ఇతర పదార్థాలను స్వాధీనం చేసుకున్నారు. అటవీ ప్రాంతంలో భద్రతా బలగాలు నిరంతరాయంగా సోదాలు నిర్వహిస్తూ.. మావోయిస్టులు దాచిపెట్టిన పెద్ద మొత్తంలో పేలుడు పదార్థాలను ఇప్పటికే స్వాధీనం చేసుకున్న సంగతి తెలిసిందే.