లిబియా తీరానికి సమీపంలో వలసదారులతో వెళ్తున్న పడవ సముద్రంలో బోల్తా పడింది. అక్రమంగా ఒక దేశం నుంచి మరో దేశానికి వెళ్తున్న ఈ పడవలో మొత్తం 42 మంది ఉన్నారు. వీరంతా గల్లంతైనట్లు అధికారులు తెలిపారు. పడవ సముద్రం మధ్యలోకి వెళ్లిన తర్వాత ఇంజిన్ పనిచేయడం ఆగిపోవడంతో ఈ ఘోర ప్రమాదం జరిగి ఉంటుందని అధికారులు అనుమానిస్తున్నారు. ప్రయాణికుల్లో ఏడుగురు వలసదారులు దాదాపు ఆరురోజుల పాటు సముద్రం మధ్యలో ఉన్నారు. చివరకు లిబియా దేశ అధికారులు వారిని రక్షించారు.

