
లార్డ్స్ టెస్టులో టీమిండియా పోరాడి ఓడింది. 193 పరుగుల స్వల్ప లక్ష్యఛేదనలో భారత జట్టు 74.5 ఓవర్లు బ్యాటింగ్ చేసి 170 పరుగులకి ఆలౌట్ అయ్యింది. 23 పరుగుల తేడాతో లార్డ్స్ టెస్టు గెలిచిన ఇంగ్లాండ్ జట్టు, ఐదు టెస్టుల సిరీస్‌లో 2-1 ఆధిక్యం సంపాదించింది. రెండో సెషన్ మొత్తం ఒకే ఒక్క వికెట్ కోల్పోయిన భారత జట్టు, చివరి 2 వికెట్లకు 58 పరుగులు జోడించినా.. విజయాన్ని అందుకోలేకపోయింది..