జాతీయ స్థాయిలో అథ్లెట్‌గా, హాకీ ప్లేయర్‌గా రాణిస్తున్న ఓ యుకెరటం జీవితం అర్ధాంతరంగా ముగిసింది. లక్నోలో ఆదివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో జూలీ యాదవ్ అనే 23 ఏళ్ల అమ్మాయి దర్మరణం చెందింది. స్పోర్ట్స్ ఈవెంట్ కోసం ముందుగానే వెళ్లింది. అయితే.. మొబైల్ ఫోన్ ఇంటి వద్దనే మర్చిపోయింది తను. ఫోన్ కోసం ఇంటికి వెళ్తుండగా.. గ్యాస్ సిలిండర్లతో కూడిన ట్రక్కు జూలీ బండిని ఢీకొన్నది. వేగంగా వచ్చిన ఒక ట్రక్కు ఢీకొట్టింది. ఈ సంఘటనలో తను ప్రాణాలు కోల్పోయింది.

