
ఆదివారం అర్థరాత్రి వరకూ అసెంబ్లీలో కాళేశ్వరం రిపోర్టుపై తీవ్రంగా పోరాడిన హరీష్ రావు, సోమవారం సాయంత్రానికే లండన్‌లో ప్రత్యక్షమవడం రాజకీయ వర్గాల్లో పెద్ద చర్చకు దారితీసింది. అసెంబ్లీలో జరిగిన పరిణామాలపై చర్చించేందుకు ఉదయం ఫామ్‌హౌస్‌కు వెళ్లిన నేతల్లో హరీష్ రావు లేకపోవడంతో ఆయన ఎక్కడ ఉన్నారన్న సందేహాలు మొదలయ్యాయి. అయితే లండన్ విమానాశ్రయంలో ఆయనకు ఎన్నారై కార్యకర్తలు స్వాగతం పలికిన ఫోటోలు బయటకు రావడంతో ఆయన విదేశాల్లో ఉన్న సంగతి స్పష్టమైంది.