
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చర్ల మండలంలో వీరాపురం గ్రామానికి చెందిన గర్భిణీ పోడియం ఇరమ్మకు తెల్లవారు జామున 3 గంటల సమయంలో ప్రసవ నొప్పులు వచ్చాయి. ఆమె కుటుంబ సభ్యులు మూడు కిలోమీటర్ల దట్టమైన అడవిలో గర్భిణీను జెట్టీలో మోసుకొచ్చారు. బురదలో జెట్టిని మోయలేక ఒకసారి గర్భిణీతో సహా కింద పడిపోయారు. అనంతరం అడవిలోనే ఇరమమ్మ ఆడపిల్లను ప్రసవించింది. అందుబాటులో ఉన్న ఆశ కార్యకర్త గంగమ్మ బొడ్డు పేగును కత్తిరించించింది. ఆ తర్వాత తిరిగి జెట్టీ లోనే బాలింతను కుటుంబ సభ్యులు ముందుకు మోసుకెళ్లారు.