
తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పాలన వచ్చి కేవలం 18 నెలల్లోనే రైతుల కోసం 4 వేల కోట్లు ఖర్చు చేశాం. రుణ మాఫీ, వరికి బోనస్, రైతు భరోసా అంటూ రైతులకి అండగా నిలిచాం. కేసీఆర్ మాత్రం అప్పులు, స్కాంలు చేసి రాష్ట్రాన్ని ఆగం చేశారని, మిగులు రాష్ట్రానికి ఏకంగా 8 లక్షల కోట్లు అప్పు చేసి మా నెత్తిపై వేశారు. రైతు రుణ మాఫీ కోసం కేసీఆర్ ఔటర్ రింగ్ రోడ్డు అమ్మేశాడని తీవ్ర ఆరోపణలు చేసారు సీఎం రేవంత్ రెడ్డి.