చిత్తూరు జిల్లా బైరెడ్డిపల్లి మండలంలో విజయ భాస్కర్ రెడ్డి అనే రైతుకు 17 ఎకరాల భారీ మామిడి తోట ఉంది. ఇందులో దాదాపు 22 సంవత్సరాల వయసు గల పెద్ద చెట్లు ఉన్నాయి. అయితే, శనివారం గుర్తు తెలియని దుండగులు తోటలో నిప్పు పెట్టారు. తోటలో ఎండు గడ్డి ఉండటంతో మంటలు క్షణాల్లో వ్యాపించాయి. మామిడి చెట్లు మంటల్లో చిక్కుకుని మాడిపోయాయి. చెట్లతో పాటు పొలంలో అమర్చిన ఖరీదైన డ్రిప్ పరికరాలు, పైపులు, తీగ జాతి మొక్కల తొడుగులు పూర్తిగా కాలిపోయాయి.

