
సైనికులకు సెల్యూట్ చేయడానికి బదులుగా, ఎన్ని రాఫెల్లను కాల్చివేశారని అడగడం సిగ్గుచేటు అన్నారు. ఇది భారత సైన్యం నైతికతను దెబ్బతీస్తుందన్న కిషన్ రెడ్డి. వారి అజ్ఞానాన్ని బహిర్గతం చేస్తుందన్నారు. జాతీయ భద్రతను రాజకీయ అపహాస్యం చేస్తుందన్నారు. కాంగ్రెస్ నేత కుళ్లు రాజకీయాలు భారతదేశ దౌత్య లాభాలను, జాతీయ ప్రయోజనాలను ప్రమాదంలో పడేస్తాయన్నారు. మేము చప్పట్లు అడగమని, భారతదేశం విజయాల గురించి ఏడవడం ఆపండి అంటూ కిషన్ రెడ్డి హితబోధ పలికారు.