
రేవంత్ రెడ్డిపై కాంగ్రెస్ నేత, ఏఐసీసీ ఇంచార్జి కన్నయ్య కుమార్ విరుచుకుపడ్డారు. రేవంత్ రెడ్డి ఒక మూర్ఖుడు.. తెలివితక్కువ వాడు అని సంచలన వ్యాఖ్యలు చేశారు. బీహార్ ప్రజలను కూలీలు అని ఎలా అంటాడని రేవంత్ రెడ్డిని నిలదీశారు.
దొంగతనం చేసే వారిని దొంగలు అని అంటారు.. తెలివి లేకుండా మాట్లాడే వారిని మూర్ఖుడు అని అంటారు అని, రేవంత్ రెడ్డి మా పార్టీ సీఎం అయినా మూర్ఖుడే అని అంటా.. నేను భయపడను అని కాంగ్రెస్ నేత కన్నయ్య కుమార్ తేల్చిచెప్పారు.