
దేశంలో ఎక్కడా లేనివిధంగా రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు ఐదు డీఏలను రేవంత్ ప్రభుత్వం పెండింగ్ పెట్టింది అని మాజీ మంత్రి హరీశ్‌రావు తెలిపారు. రేవంత్ ప్రభుత్వానికి కాంట్రాక్టర్ల మీద ఉన్న శ్రద్ధ ప్రభుత్వ ఉద్యోగులపై లేదు అని ఆయన మండిపడ్డారు. ఈరోజు కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు కేంద్ర ప్రభుత్వం 3 శాతం డీఏను మంజూరు చేస్తూ తీపి కబురు చెప్పింది. కానీ రేవంత్ రెడ్డి మాత్రం తెలంగాణ ఉద్యోగులకు చేదు ఫలితాలను అందిస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు ఐదు డిఏలు పెండింగ్‌లో ఉన్నాయి.