బీహార్ ప్రజలను కించపరిచేలా మాట్లాడిన తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై రాహుల్ గాంధీ చర్యలు తీసుకోవాలని జన్ సురాజ్ పార్టీ అధ్యక్షుడు ప్రశాంత్ కిశోర్ డిమాండ్ చేశారు. ఆ తరువాతే బీహార్ రాష్ట్రంలో ఎన్నికల ప్రచారానికి రాహుల్ రావాలని మండిపడ్డారు. కెసిఆర్ బీహార్ అడ్వైసర్‌లను పెట్టుకొని రాష్ట్రాన్ని దివాళా తీయించాడని, కూలీ పనులు చేయడం బీహార్ ప్రజల డిఎన్ఎలోనే ఉందని రేవంత్ రెడ్డి మాట్లాడారని గుర్తు చేశారు. ఇవాళ రాహుల్ గాంధీ ఏం మొహం పెట్టుకొని బీహార్‌లోకి వస్తున్నారని ప్రశ్నించారు.

