
రాష్ట్రంలో ప్రభుత్వ ఉద్యోగాల భర్తీకి సంబంధించిన ప్రక్రియ ఊపందుకున్న నేపథ్యంలో.. టీజీపీఎస్సీ గ్రూప్ 2 తుది ఫలితాలను విడుదల చేయడానికి సిద్ధమైంది. ఇప్పటికే అభ్యర్థుల సర్టిఫికేట్ల పరిశీలన కార్యక్రమం విజయవంతంగా పూర్తి చేసింది. సెప్టెంబర్ 28వ తేదీన మొత్తం 783 పోస్టులకు ఎంపికైన అభ్యర్థుల జాబితాను విడుదల చేయనున్నట్లు కమిషన్ విడుదల చేసే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది.