
వైసీపీ అధినేత జగన్ రేపు నెల్లూరు పర్యటన కు వస్తుండటంపై టీడీపీ సీనియర్ నేత సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి రేపు జగన్ పర్యటన పై సోమిరెడ్డి స్పందన తీవ్రంగా స్పందించారు. జగన్ ఏ ముఖంతో నెల్లూరు వస్తున్నారని ఆయన ప్రశ్నించారు.జగన్ మాట విని అనేక మంది అధికారులు సమస్యలు ఎదుర్కొన్నారని సోమిరెడ్డి తెలిపారు. వారి సమస్యలను పట్టించుకోకుండా కాకాణిని పరామర్శించడానికి రావడం సరికాదన్నారు. లిక్కర్ స్కాంలో జైలుకెళ్లిన మిథున్ రెడ్డి, రాజ్ కెసిరెడ్డి, ధనంజయరెడ్డిలను కూడా జగన్ పరామర్శించాలని ఆయన వ్యంగ్యంగా వ్యాఖ్యానించారు.