
ఫార్ములా ఈ కార్ రేసు కేసులో ఎసిబి దూకుడు పెంచింది. ఈ కేసుకు సంబంధించి కెటిఆర్ సెల్‌ఫోన్, ల్యాప్‌టాప్ లను స్వాధీనం చేసుకునేందుకు సిద్ధమైంది. నిన్న ఫార్ములా ఈ కేసులో ఎసిబి విచారణకు కెటిఆర్ హాజరైన సంగతి తెలిసిందే.
ఈ విచారణ అనంతరం కెటిఆర్ వాడిన సెల్‌ఫోన్, మ్యాక్‌బుక్, ట్యాబ్‌లో కీలక సమాచారం ఉందని ఎసిబి అధికారులు భావిస్తున్నట్లు సమాచారం. ఈ ఎలక్ట్రానిక్ పరికరాల నుంచే కెటిఆర్, అధికారులకు ఆదేశాలు ఇచ్చారని అనుమానిస్తున్నట్లు తెలుస్తోంది.