
రాజధాని ఢిల్లీ నగరం వాయు కాలుష్యంతో సతమతమవుతోంది. దీపావళి వేడుకలు జరిగిన మూడు రోజుల తర్వాత కూడా ఎయిర్ క్వాలిటీ దారుణంగా ఉన్నది. గురువారం ఉదయం 5.30 గంటలకు సగటున ఢిల్లీలో వాయు నాణ్యత 325 వద్ద నమోదైంది. చాలా ప్రాంతాలు రెడ్జోన్లోనే ఉన్నాయి.ఢిల్లీలోని అక్షరధామ్ ఆలయం సమీపంలోని దృశ్యాలు దృశ్యమానత తగ్గిపోయింది. పలు ప్రాంతాల్లో దట్టమైన పొగమంచు కమ్మేసింది. ఢిల్లీలోని చాలా ప్రాంతాల్లో 300 నుంచి 400 మధ్య ఏక్యూఐ నమోదైంది. గురువారం ఉదయం 5.30 గంటలకు ఏక్యూఐ 511 వద్ద ఉంది.