ఎదురెదురుగా వస్తున్న రెండు బస్సులు ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో 11 మంది ప్రయాణికులు మరణించారు. మరో 40 మంది గాయపడ్డారు. వారిని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. కొందరి పరిస్థితి విషమంగా ఉన్నది. దీంతో మృతుల సంఖ్య పెరుగవచ్చని తెలుస్తున్నది. తమిళనాడులోని తిరుపత్తూరు జిల్లాలో ఈ సంఘటన జరిగింది. ఆదివారం సాయంత్రం 5.30 గంటల సమయంలో కరైకుడి వైపు వెళ్తున్న ప్రభుత్వ బస్సు, మదురై వైపు వెళ్తున్న మరో ప్రభుత్వ బస్సు తిరుపత్తూరు సమీపంలోని రహదారిపై ఎదురెదురుగా ఢీకొన్నాయి.

