ెల్లూరు జిల్లా బుచ్చిరెడ్డిపాలెంలోని ఓ పెట్రోల్ బంక్‌లో వాహనదారుడు 400 రూపాయలకు పెట్రోల్ కొట్టించాడు. కానీ ఎక్కువగా పెట్రోల్ వచ్చినట్లు అనిపించలేదు. బైక్‌ను అటుఇటు ఊపి చూశాడు. పెట్రోల్ తక్కువగా ఉన్నట్లు అనుమానం రావడంతో బైక్‌ను పక్కకు ఆపి.. బకెట్లో పెట్రోల్‌ను తీయడంతో బంక్ నిర్వాహకుల బాగోతం బయటపడింది. బకెట్‌లోకి కనీసం అర లీటర్ పెట్రోల్ కూడా రాలేదు. దీనిపై సిబ్బందిని ప్రశ్నించగా సరైన సమాధానం ఇవ్వలేదు మీటర్లను మ్యానిపులేట్ చేస్తూ ప్రజలను పెట్రోల్ బంక్ నిర్వాహకులు మోసం చేస్తున్నారని ఆరోపించారు.

