కొండాపూర్లోని రాఘవేంద్ర కాలనీలో పార్కు స్థలాన్ని కబ్జా చేసి సొంతం చేసుకునే ప్రయత్నాలకు హైడ్రా చెక్ పెట్టింది. 2వేల చదరపు గజాల స్థలాన్ని కాపాడింది. దీని విలువ సుమారు రూ.30 కోట్ల వరకు ఉంటుందని హైడ్రా పేర్కొంది.
రాఘవేంద్ర కాలనీలో పార్కుతోపాటు కమ్యూనిటీ హల్ నిర్మాణానికి 2 వేల చదరపు గజాల స్థలాన్ని లే అవుట్లో చూపించారు. అయితే, ఈ స్థలం ఖాళీగా ఉండడంతో బై నంబర్లు సృష్టించి 10 ప్లాట్లుగా విభజించి షెడ్లు వేశారు.

