బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో గెలుపు కోసం రూ.14,000 కోట్ల ప్రపంచ బ్యాంకు నిధులను సీఎం నితీశ్ కుమార్ ప్రభుత్వం వినియోగించిందని ప్రశాంత్ కిషోర్‌కు చెందిన జన్ సురాజ్ పార్టీ ఆరోపించింది. ఎన్నికలకు ముందు ముఖ్యమంత్రి మహిళా రోజ్‌గార్ యోజన కింద 1.25 కోట్ల మహిళలకు రూ.10,000 చొప్పున నగదు బదిలీ చేయడానికి ఈ నిధులు దారి మళ్లించినట్లు విమర్శించింది. తద్వారా ఎన్డీయే ప్రభుత్వం ఎన్నికలను ప్రభావితం చేసినట్లు ఆరోపించింది. ఇంత పెద్ద మొత్తంలో డబ్బును తిరిగి పొందే సామర్థ్యం బీహార్ ఆర్థిక వ్యవస్థకు లేదని ఉదయ్ సింగ్ ఆరోపించారు.

