విశాఖపట్నం రుషికొండపై నిర్మించిన వివాదాస్పద భవనాలను లగ్జరీ హోటల్‌గా మార్చేందుకు ప్రముఖ హాస్పిటాలిటీ సంస్థలు ఆసక్తి చూపుతున్నాయి. టాటా గ్రూప్‌కు చెందిన ఇండియన్ హోటల్స్ కంపెనీ లిమిటెడ్ IHCL-తాజ్ గ్రూప్) ,
లీలా ప్యాలెస్ హోటల్స్ సహా లెమన్ ట్రీ, మహీంద్రా, మారియట్ వంటి సంస్థలు ఈ ప్రాజెక్టును అభివృద్ధి చేయడానికి ముందుకు వచ్చాయి. ప్రభుత్వం ఏర్పాటు చేసిన మంత్రుల బృందం (GoM) వివిధ ఆప్షన్లను ఖరారు చేసిన తర్వాత తమ సిఫారసులను ఆంధ్రప్రదేశ్ కేబినెట్ ముందు ఉంచనుంది.

