
ఇన్స్టాగ్రామ్ విజయవంతంలో రీల్స్ ఒక కారణమని ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఒక రీల్ పూర్తికాగానే మరో రీల్ చూడాలంటే స్క్రీన్‌పై స్క్రోల్ చేయాలనే విషయం తెలిసిందే. ఆటో స్క్రోల్ పేరుతో తీసుకొస్తున్న ఈ ఫీచర్ సహాయంతో ఇకపై స్క్రోల్ చేయాల్సిన అవసరం ఉండదు. ఒక వీడియో పూర్తవగానే దానంతటదే తదుపరి వీడియోకి జంప్ అవుతుంది. ఇన్స్టాగ్రామ్ ఈ ఫీచర్‌ను ఇప్పుడు కొంతమంది ఎంపిక చేసిన యూజర్లతో పరీక్షిస్తోంది. ఆటో స్క్రోల్ వల్ల డిజిటల్ అడిక్షన్ పెరిగే ప్రమాదం ఉందని మానసిక ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు.