జూబ్లీహిల్స్లో రౌడీయిజంతో ఉప ఎన్నిక జరిగిందని బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి మాగంటి సునీత ఆరోపించారు. ప్రజాస్వామ్యంలో అప్రజాస్వామ్యంగా జరిగిన ఎన్నిక ఇది అని ఆమె అభివర్ణించారు. ప్రజలను భయపెట్టి ఓట్లు వేయించుకున్నారంటూ కాంగ్రెస్ పార్టీ నేతలపై ఆమె మండిపడ్డారు. ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేశారని విమర్శించారు. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ రిగ్గింగ్ చేసి గెలిచిందంటూ తీవ్ర విమర్శలు చేశారు. ఈ ఉప ఎన్నిక నిర్వహణలో ఎన్నికల సంఘం (ఈసీ) విఫలమైందన్నారు. నైతికంగా తానే గెలిచానని ఈ సందర్భంగా మాగంటి సునీత స్పష్టం చేశారు.

