అమెరికా డాలర్‌తో పోలిస్తే భారత రూపాయి చరిత్రలో తొలిసారిగా అత్యంత తక్కువ స్థాయికి పడింది. ఇవాళ ట్రేడింగ్‌లో రూపాయి ఒక దశలో ₹91.74 వద్ద all-time low ను నమోదు చేసింది. నిన్న 90.97 వద్ద ముగిసిన రూపాయి, ఉదయం 91.05 వద్ద బలహీనంగా ప్రారంభమైంది. ఒక్కరోజే 77 పైసల వరకు విలువ కోల్పోయింది. ఈ పతనానికి కారణాలు దేశీయ మార్కెట్ల నుండి విదేశీ పెట్టుబడిదారులు (FIIలు) తమ పెట్టుబడులను ఉపసంహరించడం, బంగారం మరియు వెండి దిగుమతుల పెరుగుదల ప్రధానంగా ఉన్నాయి.

