తెలంగాణ శాసనసభ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ కుమార్తె గడ్డం అనన్య (24) అతి పిన్న వయసులోనే మున్సిపల్ చైర్‌పర్సన్‌గా ఎన్నికై రికార్డు సృష్టించారు. వికారాబాద్‌కు చెందిన అనన్య, కాంగ్రెస్ పార్టీ తరపున 17వ వార్డు నుంచి విజయం సాధించి, ఏకగ్రీవంగా మున్సిపల్ చైర్‌పర్సన్‌గా ఎన్నికయ్యారు. ఈ విజయంతో ఆమె పేరు రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. తండ్రి నీడలో కాకుండా, క్షేత్రస్థాయి రాజకీయాల్లో తనదైన గుర్తింపు తెచ్చుకోవాలన్నదే తన లక్ష్యమని అనన్య తెలిపారు. వికారాబాద్ అభివృద్ధికి కృషి చేస్తానని ఆమె హామీ ఇచ్చారు.

