భారత క్రికెట్ దిగ్గజం, టీమిండియాకు హెడ్ కోచ్‌గా పనిచేసిన రాహుల్ ద్రవిడ్ వారసత్వాన్ని ఆయన కుమారులు ముందుకు తీసుకువెళుతున్నారు. ద్రవిడ్ చిన్న కుమారుడు అన్వయ్ ద్రవిడ్ క్రికెట్ కెరీర్‌లో మరో మెట్టు ఎక్కారు. కర్ణాటక రాష్ట్ర క్రికెట్ అసోసియేషన్ అవార్డులు అందుకోవడంతో పాటు, ఇటీవల వీనూ మాంకడ్ ట్రోఫీలో కర్ణాటకకు కెప్టెన్‌గా వ్యవహరించిన అన్వయ్.. హైదరాబాద్‌లో బుధవారం నుంచి ప్రారంభం కానున్న పురుషుల అండర్-19 వన్డే ఛాలెంజర్ ట్రోఫీకి ప్రకటించిన భారత జట్టులో అన్వయ్ చోటు దక్కించుకున్నాడు.

