
విదేశీ పర్యటనల సందర్భంగా భద్రతా ప్రోటోకాల్స్ ను ఉల్లంఘించారని ఆరోపిస్తూ లోక్‌సభ ప్రతిపక్ష నేత, ఎంపీ రాహుల్ గాంధీకి సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్(CRPF) లేఖ రాసింది. అలాగే కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గేకూ CRPF లేఖ రాసింది. లేఖలో రాహుల్ గాంధీ తన భద్రతను సీరియస్‌గా తీసుకోవడం లేదని సీఆర్‌పీఎఫ్ వీవీఐపీ సెక్యూరిటీ చీఫ్ సునీల్ జూన్ ఆరోపించారు.ఇటలీ, వియత్నాం, దుబాయ్, ఖతార్, లండన్, మలేషియా వంటి దేశాల్లో ప్రోటోకాల్‌కు విరుద్ధంగా ఆయన పర్యటించారని పేర్కొన్నారు.