హర్యానాలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో బ్రెజిల్ మోడల్ పేరుతో 22 ఓట్లు ఉన్నాయని రాహుల్ గాంధీ ఆరోపించారు. తనకు చెందిన 20 ఏళ్ల వయసులో ఓ పాత ఫోటోను ఇండియాలో ఓటింగ్ కోసం వాడినట్లు తెలిసిందని, ప్రజల్ని మోసం చేసేందుకు తనను ఇండియన్‌గా చూపిస్తున్నారని, ఇదేం వెర్రితనం, ఇంత పిచ్చా, మనం ఏం ప్రపంచంలో జీవిస్తున్నాం అని బ్రెజిల్ మోడల్ తన వీడియోలో పేర్కొన్నది. వాస్తవానికి లారిసా నేరి మోడల్ కాదు. ఆమె సాధారణ మహిళే అని తెలుస్తోంది. హెయిర్‌డ్రెస్సర్‌గా పనిచేస్తున్నది

