
కర్ణాటక ఎన్నికల్లో ఓట్ల అవకతవకలు జరిగాయని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ చేసిన ఆరోపణలపై ఆ రాష్ట్ర ముఖ్య ఎన్నికల అధికారి (CEO) స్పందించారు. రాహుల్ గాంధీ చేసిన ఆరోపణలకు సంబంధించిన పత్రాలను అందజేయాలని కర్ణాటక CEO ఆయనకు నోటీసులు జారీ చేశారు. ఆరోపణలకు ఆధారాలు చూపిస్తే, వాటిపై విచారణ జరుపుతామని ఆయన తెలిపారు. షకున్ రాణి లేదా ఇతర ఏ వ్యక్తులు రెండుసార్లు ఓట్లు వేయలేదని ఎన్నికల ప్రక్రియ పారదర్శకంగా జరిగిందని, ఎలాంటి అక్రమాలు జరగలేదని ఆయన తేల్చి చెప్పారు.