కాంగ్రెస్ అగ్రనేత, లోక్‌సభ ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీకి లక్నో హైకోర్టులో గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ఆయనపై ఉన్న ద్వంద్వ పౌరసత్వం ఆరోపణలకు సంబంధించి తక్షణమే FIR నమోదు చేయాలని కోర్టు ఉన్నత స్థాయి అధికారులను ఆదేశించింది. 2024లో కర్ణాటకకు చెందిన బీజేపీ కార్యకర్త విఘ్నేశ్ దాఖలు చేసిన పిటిషన్‌పై విచారణ చేపట్టిన ధర్మాసనం, ఈ వివాదంలో ప్రాథమిక విచారణ అవసరమని భావించింది. రాహుల్ గాంధీకి బ్రిటీష్ పౌరసత్వం కూడా ఉందనేది పిటిషనర్ ప్రధాన ఆరోపణ.

