
రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము పెను ప్రమాదం నుంచి తప్పించుకున్నారు. ద్రౌపదీ ప్రయాణిస్తున్న హెలికాప్టర్ ల్యాండవుతుండగా హెలిప్యాడ్ ఒక్కసారిగా కుంగిపోయింది. వెంటనే అధికారులు అప్రమత్తమై రాష్ట్రపతిని హెలికాప్టర్ నుంచి బయటకు తీసుకొచ్చారు. కొచ్చిలోని ప్రమదం స్టేడియంలో ల్యాండింగ్ తర్వాత హెలికాప్టర్ ఓ వైపు ఒరిగింది. హెలిప్యాడ్ కుంగిపోవడంతో హెలికాప్టర్ ఒక వైపు ఒరగడంతో భద్రతా సిబ్బంది ఆందోళన చెందారు. పోలీసులు, అగ్నిమాపక శాఖ సిబ్బంది అక్కడికి చేరుకొని హెలికాప్టర్ ను ముందుకు తోశారు. అనంతరం రాష్ట్రపతిని బయటకు తీశారు.