
తెలంగాణ రాష్ట్రంలో ఐదు రోజుల పాటు వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం ప్రకటించింది. మరో నాలుగు రోజుల రాష్ట్రంలోని పలు జిల్లాల్లో పాటు ఉరుములు, మెరుపులు, ఈదురు గాలులతో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని ఎల్లో హెచ్చరికలు జారీ చేసింది. జూన్ నెలలో రెండు వారాల పాటు అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతాయని, వర్షాలు అక్కడక్కడ కురుస్తాయని అంచనా వేసింది. ఈ క్రమంలో గత వారం రోజుల నుండి రాష్ట్రంలో భిన్నమైన వాతావరణ పరిస్థితి నెలకొంది.