ఐ బొమ్మ రవి అరెస్ట్ తర్వాత ఇండస్ట్రీలోనే కాకుండా బయట కూడా పైరసీపై విస్తృత చర్చ జరుగుతోంది. ఈ వివాదంపై దర్శకుడు రామ్ గోపాల్ వర్మ సంచలన వ్యాఖ్యలు చేశారు. రవిని రాబిన్ హుడ్‌తో పోల్చడాన్ని ఆయన తీవ్రంగా వ్యతిరేకించారు. వర్మ ప్రకారం, రాబిన్ హుడ్ హీరో కాదని, ప్రపంచంలోనే మొట్టమొదటి ఉగ్రవాది అని ఆయన ట్వీట్ చేశారు. సినిమా టికెట్ల ధరలు, పాప్‌కార్న్ ధరలు ఎక్కువగా ఉన్నాయన్న కారణంతో పైరసీని సమర్థించడం సరైంది కాదని వర్మ స్పష్టం చేశారు.

