
పాయకరావుపేట, నక్కపల్లి, రాజయ్యపేట సముద్ర తీరంలో మెడికల్ ఫ్యాక్టరీల వల్ల మత్స్యకారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వంగలపూడి అనిత స్పందన కోరుతున్నారు. మత్స్య సంపదను తినేస్తున్న మెడికల్ కంపెనీలు మాకొద్దు మహాప్రభో.. అంటూ తీరంలో ఉన్న మత్స్యకార కుటుంబాలు ఆవేదన వ్యక్తం చేస్తున్నాయి. ఈ పరిస్థిని ఇటీవలే ప్రారంభమైనది కాదని.. ఎన్నో సంవత్సరాలుగా దీని కారణంగా తాము తీవ్రంగా ఇబ్బంది పడుతున్నామని మత్స్యకారులు ఆవేదన చెందుతున్నారు. ఇలాంటి తరుణంలో మరో భారీ సంస్థ రావడం ఏంటని వారు ప్రశ్నిస్తున్నారు.