రాజాసాబ్ నిర్మాతల విజ్ఞప్తి మేరకు టికెట్ ధరలు పెంచుకునేందుకు ఎపి ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. జనవరి 8న ప్రీమియర్ షోకు టికెట్ ధర రూ.1,000గా నిర్ణయించారు. స్పెషల్ షోకు కూడా అనుమతి ఇచ్చింది. ఇక, జనవరి 9వ తేదీ నుంచి 10 రోజుల వరకు సింగిల్ స్క్రీన్లలో టికెట్ ధరపై రూ.150, మల్టీప్లెక్సుల్లో రూ.200 పెంచుకోవడానికి అనుమతిస్తూ ఎపి సర్కార్ ఉత్తర్వులు జారీ చేసింది. అలాగే, తెలంగాణలోనూ ఈమూవీ టికెట్ ధరలు పెంచుకునేందుకు చిత్ర నిర్మాతలు రాష్ట్ర హైకోర్టులో అప్పీలు చేశారు.

