బీజేపీ తనను రాజకీయంగా ఓడించలేకపోయిందని పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ విమర్శించారు. ఎన్నికల కమిషన్ ఇప్పుడు నిష్పాక్షికంగా వ్యవహరించకుండా, ‘బీజేపీ కమిషన్’లా మారిందని ఆరోపించారు. బొంగావ్లో జరిగిన యాంటీ-SIR సభలో ఆమె మాట్లాడుతూ, బిహార్లో NDA వ్యూహాన్ని ప్రతిపక్షాలు అంచనా వేయలేదని అభిప్రాయపడ్డారు. అంత త్వరగా SIR నిర్వహించాల్సిన అవసరం ఏమిటో ప్రజలు ప్రశ్నించాల్సిన సమయం వచ్చిందని చెప్పారు. ఓట్ల పట్టిక ఖచ్చితంగా లేకపోతే, 2024లో బీజేపీ సాధించిన విజయాన్ని కూడా నమ్మలేమని ఆమె పేర్కొన్నారు.

