అసెంబ్లీ సాక్షిగా సీఎం పచ్చి అబద్ధాలు చెప్పారని అన్నారు. మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి భార్య, కొడుకు, తమ్ముడు దూరపు బంధువులు ఎలా అవుతారని ప్రశ్నించారు. రాఘవ పేరు స్వయాన మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తండ్రిపేరని, ఆ కంపెనీ ఆయనదేనని లోకమంతా తెలుసని వ్యాఖ్యానించారు. సీఎం రేవంత్ రెడ్డి అసెంబ్లీని తప్పుదోవ పట్టించారని మండిపడ్డారు. కాంగ్రెస్ సర్కార్, అక్రమాలపై ప్రశ్నిస్తే డొంకతిరుగుడు సమాధానాలు చెబుతోందని ఆక్షేపించారు. రాఘవ కన్స్ట్రక్షన్స్ అవినీతి, అక్రమాలపై ప్రభుత్వం తక్షణమే కఠిన చర్యలు తీసుకోవాలని హరీశ్ రావు డిమాండ్ చేశారు.

