సూపర్‌స్టార్ రజనీకాంత్ శుక్రవారం తన 75వ జన్మదినాన్ని జరుపుకుంటున్నారు. ఈ సందర్భంగా ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఆయన అభిమానులు, ప్రముఖులు నుంచి ఆయనకు శుభాకాంక్షలు వెల్లువెత్తున్నాయి. రజనీకాంత్‌కు ప్రధాని నరేంద్ర మోదీ ఎక్స్ వేదికగా స్పెషల్ విషెష్ తెలిపారు. రజినీకాంత్ నటన తరతరాలను అలరించిందని మోదీ కొడియాడారు. 50 ఏళ్ల సుదీర్ఘ సినీ ప్రస్థానాన్ని విజయవంతంగా పూర్తి చేశారని, ఎన్నో ప్రశంసలు అందుకున్నారని గుర్తు చేశారు. ఆయన పోషించిన పాత్రలు ఎప్పటికీ గుర్తుండిపోతాయని చెప్పుకొచ్చారు.

