56వ ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ ఇండియా (IFFI)గోవాలో అట్టహాసంగా జరగనున్నాయి. అయితే ఈఏడాది ఈవెంట్లో సౌత్ హీరోలు రజనీకాంత్ , బాలకృష్ణకు అరుదైన గౌరవం దక్కనుంది. వారు 50 ఏళ్ల సినీ ప్రస్థానాన్ని పూర్తి చేసుకున్న నేపథ్యంలో ఇద్దరు అగ్ర హీరోలను గోవా అంతర్జాతీయ సినీ ఉత్సవాల్లో సన్మానించనున్నారు. ఈ విషయాన్ని కేంద్ర సమాచార ప్రసారశాఖ సహాయ మంత్రి ఎల్.మురుగన్ ఈ విషయాన్ని వెల్లడించారు . ఈ వేడుకలకు ఏర్పాట్లు పూర్తయ్యాయని, దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి సినీ ప్రముఖులు హాజరవుతారని తెలిపారు.

